కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ o

Spread the love

Health protection of personnel working in Krishna District Police Department o

కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ మా బాధ్యత- జిల్లా ఎస్పీ.

వయస్సు దృష్ట్యా సిబ్బంది అందరికి ప్రత్యేకంగా హెల్త్ మ్యాపింగ్.

మొదటి విడతగా 40 సంవత్సరాల పైబడిన 1041 మందికి కంప్లీట్ మాస్టర్ హెల్త్ చెకప్.

కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ ప్రథమ బాధ్యతగా స్వీకరించి, జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మొత్తం(పోలీస్, కార్యాలయ సిబ్బంది ,హోమ్ గార్డ్స్, వివిధ విభాగాలలో పనిచేస్తున్న) 3063 మందికి కంప్లీట్ హెల్ప్ చెకప్ నిర్వహించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి యొక్క హెల్త్ కండిషన్ ఆధారంగా వైద్య చికిత్సలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తూ, ఈరోజు మచిలీపట్నం నందు పోలీస్ వెల్ఫేర్ కల్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్ ను జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ నిర్వహించడం జరిగింది. కేవలం మచిలీపట్నంలోనే కాక నాలుగు సబ్ డివిజన్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మొదటి విడతగా 40 సంవత్సరాలు పైబడిన 1041 మంది సివిల్, ఏ ఆర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, హోమ్ గార్డ్స్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఇతర విభాగాలకు చెందిన పోలీస్ సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన రికార్డులన్నిటిని భద్రపరిచి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంచనా వేయడం జరుగుతుంది.

వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి నాలుగు విభాగాలుగా కేటాయించి అందులో ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్నవారికి ఆరోగ్య సూచనలు చేస్తూ, చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి తగిన వైద్య మెలకువలు తెలియజేస్తూ, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, మితిమీరిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి వైద్యుల సూచనల మేరకు, రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉత్తమ వైద్యశాలలో వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

మొదటి విడతగా 40 సంవత్సరాలు పైపడిన 1041 మందికి కంప్లీట్ మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించడం జరుగుతుంది. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రణాళికల రూపొందిస్తామని ఎస్పీ తెలిపారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అంటేనే ఏ క్షణంలో ఏ బందోబస్తు వస్తుందో తెలియదని, క్షణం తీరికలేని విధులు, సమయాభావం లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి మొదలైన కారణాల వలన సిబ్బంది ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి కేటాయించడం లేదు. వీటివలన ప్రస్తుతం ఏ సమస్య లేకుండా దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

దీనివలన విధులపై దృష్టి కేటాయించలేక, కుటుంబ సభ్యులతో సరదాగా గడపలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో రహదారి ప్రమాదం లో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా గుండెపోటుతో మరొక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.

ఇవే కాకుండా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎంతోమంది సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ సంఘటన నుండి పరిశీలించిన మీదట సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మెరుగైన వైద్యం అందించేలా తీసుకుని చర్యల్లో భాగంగా ఈరోజు నుంచి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3063 మంది సిబ్బంది ఉండగా, అందులో 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు 814 మంది, 30-40 వయసు కలిగిన వారు 1208 మంది ,40-50 వయసు కలిగిన వారు 508 మంది, 50 సంవత్సరాల పైబడి 533 మంది ఉండగా వారందరికీ దశలవారీగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క హెల్త్ కండిషన్ ఆధారంగా అవసరమైన పరీక్షలు చేసి ఉత్తమ వైద్యశాలలో వైద్య చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటివరకు వారి యొక్క వయసును పరిగణలోకి తీసుకొని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారి వివరాలు సేకరించాము. సిబ్బంది అందరూ కూడా మంచి ఆహారపు నియమాలు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు

మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి వైద్య శిబిరం నిర్వహించడానికి జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఇంద్ర దేవి ని, డిఎంహెచ్ఓ గీతాబాయి ని, అడగగానే మెడికల్ క్యాంపు నిర్వహణకు అంగీకరించినందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే హాస్పటల్ సూపర్నెంట్ వరప్రసాద్ ని డిప్యూటీ సూపర్నెంట్ చంద్రశేఖర్ , మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ కి ఈ మెడికల్ క్యాంపు విచ్చేసిన వైద్యులకు వైద్య సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 13 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని దీనిని 40 సంవత్సరాల ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు. ముందుగా ఎస్పీ బిపి, ఇతర వైద్య పరీక్షలు చేయించుకొని, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట రామాంజనేయులు , అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ ఎస్ వి డి ప్రసాద్ , డీఎస్పీలు స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్బి,SEB, పట్టణ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page