డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను పరిష్కరించిన శుభసందర్భం

Spread the love


Good luck solving the drainage outlet problem

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీ లో ఎన్నో ఏండ్ల నుండి నెలకొన్న డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను పరిష్కరించిన శుభసందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలవ తో సత్కరించి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసిన కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు.

ఈ సందర్బంగా సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నాటి నుండి కాలనీ లో నెలకొన్న డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక చొరవతో పరిష్కరిచడం జరిగినది అని , హర్షం వ్యక్తం చేస్తూ కాలనీ వాసులందరు ప్రభుత్వ విప్ గాంధీ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేయడం జరిగినది.

ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరిగినది అని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌళికవసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీ ని ఆదర్శ కాలనీ గా తీర్చిదిద్దుతామని ,వారి విజ్ఞప్తి మేరకు త్వరలోనే కాలనీ లో పర్యటిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీ లో నెలకొన్న రోడ్ల సమస్యను మరియు మంచి నీటి పైప్ లైన్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి పరిశీలిస్తానని .అదేవిధంగా కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యను పరిష్కరిస్తానని మరియు మంచి నీటి పైప్ లైన్ పునరుద్దరణ పనులు త్వరలోనే చేపడుతామని .

ముఖ్యంగా రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
,మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా శేరిలింగంపల్లి డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ పార్క్ ఫేస్ -1 ప్రెసిడెంట్ రామకృష్ణ కాలనీ వాసులు దేవేందర్ రెడ్డి, అశోక్ ,సతీష్, కిషోర్ కట్ట,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page