క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.

Spread the love

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కొణిజేర్ల మండలం పల్లిపాడు, చింతకాని మండలం నాగిలిగొండ గ్రామాల్లో పర్యటించి, పంట నష్టాన్ని, క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ఇటీవల ఆకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురు గాలులతో జిల్లాలో జరగిన పంట నష్టం పై ప్రాథమిక నివేదిక ననుసరించి రైతు వారీగా పంట నష్టం వివరాలు అంచనా వేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాల పై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సర్వే చేపట్టి నివేదిక సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతు వారీగా, కౌలు రైతు వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని, సర్వేలో గుర్తించిన అంశాలను నిర్ణిత ప్రొఫార్మాలలో బ్యాంక్ అకౌంట్ వివరాలతో సహా పొందుపరచాలని అన్నారు. పంట నష్టం నివేదిక ప్రభుత్వానికి నష్ట పరిహారంకు మంజూరు కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో ఎన్ని ఎకరాలు సాగు చేసింది, పంట ఎన్ని రోజులయింది, ఎంత మేర నష్టం జరిగింది అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారం అందుతుందని అన్నారు. ఇప్పటి వరకు 8,958 రైతులకు సంబం 10,716.05 ఎకరాల సర్వే పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. గింజ పూర్తిగా తయారవలేదని, ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది, అకాల విపత్తుతో దిగుబడి 15 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తుందని రైతులు కలెక్టర్ కు తెలిపారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా మండల ప్రత్యేక అధికారులు సిపిఓ శ్రీనివాస్, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, మండల తహశీల్దార్లు సైదులు, మంగీలాల్, ఎంపిడిఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏ.డి. బాబు రావు, మండల వ్యవసాయ అధికారి నాగయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page