వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ కిందికుంట పార్క్ లో వాకార్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి పార్క్‍లోని సమస్యలను స్వయంగా వాకర్స్‍ను అడిగి తెలుసుకోవడం జరిగిందని పార్క్‍లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అదే విధంగా సందర్శకుల కోసం పార్క్‍ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్‍ చుట్టుపక్కల మొక్కలు, పుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు.రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు తెలియజేసారు. అదేవిధంగా ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page