తెలంగాణ సచివాలయ నూతన ప్రాంగణ నిర్మాణం

Spread the love

Construction of new premises of Telangana Secretariat

తెలంగాణ సచివాలయ నూతన ప్రాంగణ నిర్మాణం తుది దశకు చేరుకుంది. జనవరి 18వ తేదీలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికి భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చని అంచనా. 18న పూజలు నిర్వహించేందుకు వీలుగా కొంత భాగాన్ని సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), రెండు మూడు మంత్రిత్వ శాఖల మంత్రుల కార్యాలయాల పూర్తికి కసరత్తు సాగుతోంది.

ముఖ్యమంత్రి, సీఎస్‌ కార్యాలయాలు ఇప్పటికే 90 శాతం పూర్తయినట్లు సమాచారం. పరిపాలన కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా భవనం పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన పూజలు నిర్వహిస్తుందా? లేదా? అన్న విషయం త్వరలో ఖరారు కానుంది.

నూతన సచివాలయం నిర్మాణానికి 2019 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు.

Related Posts

You cannot copy content of this page