టీడీపీ పేరు చెబితే సభలకు జనాలు రావడం లేదు బొల్లా బ్రహ్మనాయుడు.

Spread the love

Bolla Brahmanaidu, people don’t come to the meetings if the name of TDP is mentioned.

టీడీపీ పేరు చెబితే సభలకు జనాలు రావడం లేదు బొల్లా బ్రహ్మనాయుడు.
చంద్రబాబు గ్రాఫిక్స్ పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు -బొల్లా బ్రహ్మనాయుడు
జి వి ఆంజనేయులు కి మతి బ్రమించింది -బొల్లా
వినుకొండ లో జరిగితున్న అభివృద్ధిన్ని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారు -బొల్లా బ్రహ్మనాయుడు.


సాక్షిత : చంద్రబాబు సభలకు జనాలు రావడంలేదనే ఇదంతా.. తెలుగుదేశం పార్టీ వారు ఆశ పెట్టి పేద మహిళల్ని చంపారని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు:

ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ:

టీడీపీ పేరు చెబితే సభలకు జనాలు రావడం లేదన్న ఉద్దేశంతో స్వచ్చంద సంస్థల ముసుగులో అమెరికా నుంచి ఎవరినో ఒకరిని తీసుకువచ్చి టోకెన్లు పంచిపెట్టి అమాయక ప్రజలను మీ సభలకు తీసుకెళ్ళి, మీ స్వార్ధ రాజకీయాల కోసం పేదల ప్రాణాలు తీస్తారా?

2014 నుంచి చంద్రబాబుకు ఇదే ఖర్మ అని, గ్రాఫిక్స్ కు, డ్రోన్‌ షాట్లకు అలవాటుపడ్డ చంద్రబాబు కందుకూరు ఘటన మరువక ముందే తిరిగి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిన్న గుంటూరులో చేపట్టిన కార్యక్రమంలో ముగ్గురు నిరుపేద మహిళలు మరణించడం, మరికొందరికి గాయాలవడం చాలా ఘోరమైన పరిణామంగా చూడాలని, ఏవేవో కానుకలంటూ ఊదరగొట్టే ప్రచారంతో మహిళల్ని నమ్మకంగా తీసుకెళ్లి.. తోపులాటకు గురిచేసి మహిళాసోదరీమణుల ప్రాణాల్ని ఈ చంద్రబాబు నిలువునా తీసేశారని అన్నారు.

సంక్రాంతి కానుక పేరుతో పేద ప్రజలకు ఆశ చూపిన చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉయ్యూరు చారిట్రబుల్‌ ట్రస్ట్‌ కానుకలు పంచితే..జనసమీకరణ ఆ ట్రస్ట్‌ చేసిందా? టీడీపీ పార్టీ చేసిందా? పార్టీ కార్యక్రమం పేరుతోనే, టీడీపీ నేతలే సభకు అనుమతి తీసుకున్నారని, చంద్రబాబుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు బుకాయింపు మాటలు మాట్లాడుతూ, మనుషుల ప్రాణాలు పోయిన తరువాత మాట మారుస్తున్నారని అన్నారు.

గుంటూరులో కానుకల సభ పెట్టి, పోలీసుల వైఫల్యం అని మాట్లాడటం సిగ్గుచేటని, అక్కడ పోలీసులు సరిపడా ఉండి, వెంటనే సహాయ చర్యలు చేపట్టబట్టే ప్రమాదతీవ్రత తగ్గిందని, అక్కడ పోలీసులెవరూ లేకపోయుంటే.. ఇంకా ఎలాంటి ఘోరమైన పరిస్థితి జరిగి ఉండేదో మీడియాలో వచ్చిన విజువల్స్‌ను బట్టి మనమంతా అర్ధం చేసుకోవాలన్నారు.

20 వేల మందికి కానుకల పంపిణీ అని పర్మిషన్‌ తీసుకుని, 2 వేల మందికి టోకెన్లు ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ వారికి పేదల ప్రాణాలతో చెలగాటమాడటం నీచంగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

తాను నియోజకవర్గంలో పూర్తి చేసిన ప్రతి పనిని జీవి ఆంజనేయులు చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు

వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డు పడుతున్న సైoధవుడు జీవీ ఆంజనేయులు 10 సంవత్సరాలు వినుకొండ శాసనసభ్యునిగా ప్రజలు అవకాశం కల్పిస్తే వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిపి కమీషన్లు కోసం అభివృద్ధి పనులు వాయిదా వేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.

తానూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని జీవి ఆంజనేయులు కోర్టులకు వెళ్ళి ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని, అంతేకాక తాను ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పనిని పూర్తి చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నానని అన్నారు.

వినుకొండ పట్టణంలో కేవలం 60 లక్షల రూపాయలతో త్రాగునీటి సమస్యను తీర్చలేని అసమర్ధుడు జీవి ఆంజనేయులు అని, అంతేకాక, తాను నియోజకవర్గంలో పూర్తి చేసిన ప్రతి పనిని జీవి ఆంజనేయులు చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని జీవి ఆంజనేయులు హయాంలో వినుకొండ మునిసిపాలిటికి సంబంధించి వినుకొండ పట్టణ ప్రజలకు అందించే త్రాగు నీటి సరఫరాలో జరిగిన అవినీతిని గురించి గుర్తు చేశారు.

అందుబాటులో ఉన్న మంచినీటిని చెరువును బాగు చేయకుండా, తమ నాయకుల స్వార్ద ప్రయోజనాల కోసం వినుకొండ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చకుండా, వినుకొండ పట్టణానికి త్రాగునీటి సమస్య ఉంది అనే ఒక కారణాన్ని చూపిస్తూ వినుకొండ పట్టణంలోని ప్రజలకి ట్యాంకర్ల ద్వారా త్రాగు నీటిని అందిస్తున్నామనే నెపంతో ప్రతి సంవత్సరం 6 నుండి 7 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.

కానీ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేవలం 60 లక్షల ఖర్చుతో 60 ఎకారాలు ఉన్న చెరువును 270 ఎకరాలుగా విస్తరించి వినుకొండ ప్రజల దాహార్తిని తీర్చామనిమని తెలిపారు.

అదేవిధంగా, ఈ వినుకొండ నియోజకవర్గాన్ని తాను అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకి అయిన ఈ జి వి ఆంజనేయులు అన్ని పనులకు అడ్డుపడుతున్నారని అన్నారు. మీరు ఎన్ని విధాలా అడ్డుపడ్డ ఈ అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు, తన ప్రాణం ఉన్నత వరకు వినుకొండ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా తానూ పనిచేస్తానని అన్నారు.

Related Posts

You cannot copy content of this page