క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

Spread the love

పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం కోల్పోతారని తెలిసి వైసీపీ ముఖాలకు నిద్రపట్టడం లేదన్నారు. అనంతరం పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి పిచ్చేక్కి నిప్పు పెట్టారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జనం స్పందనను తట్టుకోలేక ఇలా చేశారని ఆరోపించారు. హింసాత్మక ప్రవర్తన, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం…అదే వైసీపీ నినాదం. వైసీపీ రౌడీలను రాజకీయాల నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.

పల్నాడు జిల్లా పెదకులపాడు నియోజకవర్గం క్రోసూరులోని టీడీపీ కార్యాలయానికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కార్యాలయం ముందు తాటాకులపాక పైకప్పును తగలబెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కొద్ది రోజుల క్రితం కూటమి అభ్యర్థి బాస్యం ప్రవీణ్… మన్నెం బుషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన ప్రజల స్పందన చూసి వైసీపీ దుర్మార్గులు ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page