ఆల్ మేవా సంఘం ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Spread the love


All Mewa Sangam Khammam District New Executive Committee Election

ఆల్ మేవా సంఘం ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కస్బా బజార్ లో, ఆల్ మేవా జిల్లా సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఆదిల్ షరీఫ్ అధ్యక్షతన జరిగిననది. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ) ఖాజా జమీర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

నూతన కార్యవర్గంలో ఆల్ మేవా జిల్లా అధ్యక్షులుగా వాణిజ్య పన్నుల శాఖాలో పనిచేస్తున్న షేక్ యాకుబ్ పాషా, ప్రధాన కార్యదర్శి గా షేక్ మదార్ సాహెబ్….. అడిషనల్ జనరల్ సెక్రటరి గా ఖాదర్ బాబా, కోశాధికారిగా షైక్ ముదస్సిర్, వైస్ ప్రెసిడెంట్ లుగా సాదిక్ అలీ, రఫీ, జాయింట్ సెక్రటరీ గా షైక్ అబ్దుల్ భాషావలి, షైక్ మహమూద్, షైక్ మౌలాకర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సయ్యద్ చాంద్ పాషా, ఐ టీ సెక్రెటరీగా ఎం డీ జాకిర్ హుస్సేన్ , ఎం డి ఖలీల్, ఈ సి మెంబెర్స్ గా షైక్ ఖాజా మొయినుద్దీన్ , షైక్ మదర్ సహాబ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నకోవడం జరిగింది.

చీఫ్ అడ్వైజర్ గా ఎం డీ సలీం (మాజీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్) మరియు గౌరవ అధ్యక్షులుగా నయీమ్ పాషా ను ఎన్నుకోవడం జరిగింది..ఈ సందర్భంగా నగర మాజి కార్పొరేటర్ షౌకత్ అలీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాకుబ్ పాషా మాట్లాడుతూ జిల్లా లోని మైనారిటీ ఉద్యోగుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం, వారి సమస్యల సాధనకై పాటుపడతానని పేర్కొన్నారు. తనపై నమ్మకముంచి జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఆదిల్ షరీఫ్ కి రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసారు. తనని సమర్ధించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page