ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం

Spread the love

According to the Chief Minister’s orders, talk to the victims and provide necessary assistance

వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి

మస్తానమ్మ

రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోయి ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకోవడంతో వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

తేజ

బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు రెండవ తరగతి చదువుతున్న చిరంజీవి తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న తేజ తండ్రి నారాయణస్వామి. తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, స్ధానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్ధలము, ఇల్లు కట్టుకోవడానికి నగదు మరియు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు

అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు, చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌తో చర్చించి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page