బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

Spread the love

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బీ సీ కులాలకు చెందిన వారికీ ఆర్ధికంగా ఉపకరించి, స్వయం ఉపాధిని కల్పించేందుకు వీలుగా లక్ష రూపాయల మేరకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నామని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఈ ఆర్ధిక సహకార పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ పధకం లో డబ్బులు పొందేందుకు ఎవ్వరికీ లంచాలు చెల్లించాల్సి అవసరం లేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. గృహ లక్ష్మి పధకంలో భాగంగా సొంత స్థలం కలిగి, పక్కా ఇళ్ళను కట్టుకోలేని నిరుపేదలకు రూ.మూడు లక్షల మేరకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు.

సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. పేదలకు అనుకులించే తమ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, ఆర్.సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, ఆర్ డీ ఓ రవికుమార్, జిల్లా బీ సీ సంక్షేమ అధికారి ఆశన్న, సికింద్రాబాద్ నోడల్ అధికారి మైత్రేయి, అధికారులు శ్రీనాథ్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ౩౦౦ మంది లబ్దిదారులకు రూ. లక్ష మేరకు ఆర్ధిక సాయం చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అందించారు

Related Posts

You cannot copy content of this page