మా కుటుంబాన్ని ఆదుకొండి.

SAKSHITHA NEWS

Support our family.

మా కుటుంబాన్ని ఆదుకొండి.
నిలువనీడ లేక అనేక సమస్యలు ఎదుర్కుంటున్న బీద కుటుంబం


సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మీ నాయక్ తండ గ్రామానికి చెందిన వాంకుడోత్ నగేష్ నాయక్, సుజాత దంపతులు వారి ఆర్థిక ఇబ్బందులను మీడియాకు తెలుపుతూ వాపోయారు. కనీసం ఆర్థిక స్థోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇద్దరు పిల్లలు ఉన్నారని పిల్లల పోషణకు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం మాకు సహకారం అందించాలని కోరారు. కనీసం ఉండడానీకి సరైన ఇల్లు కూడా లేక పూరీ గుడిసెలో జీవనం సాగిస్తున్నమని మా దీన స్థితిని ప్రభుత్వం గమనించి మాకు నివసించడానికి ప్రభుత్వం కల్పించే డబుల్ బెడ్రూం ఇల్లు తమకు కేటాయించాలని కోరారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page