SAKSHITHA NEWS
The Congress government is boasting:: Former minister Harish Rao

హైదరాబాద్ :-
ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

కొత్తగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని కాంగ్రె స్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు మాజీమంత్రి హరీష్‌రావు.

4వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన 7వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్ల రిక్రూట్‌ మెంట్‌ ఘనతను.. తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారికి నాలుగు నెలలుగా జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు.

ఎల్బీస్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి.. గాలికి వదిలేసింది తప్ప.. వారి జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు…