లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చట్టరీత్యా నేరం

SAKSHITHA NEWS

Gender tests, abortions are criminalized by law

లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చట్టరీత్యా నేరం, నిర్వహించిన వారిపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

……

సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పుట్టబోయేది ఆడబిడ్డ మగ బిడ్డ అని పరీక్షలు చేసి తెలుసుకొనినా, ఆడపిల్ల అని తెలుసుకొని అబార్షన్లు చేసిన చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు హెచ్చరించారు.
మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో గర్భధారణ పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం పై సమీక్షించారు.
ఈ చట్టముపై అందరూ అధికారులు విస్తృతంగా జిల్లాలో అవగాహన కల్పించాలన్నారు. వైద్యశాఖ అధికారులే కాకుండా ఆర్డీవోలు కూడా జిల్లాలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను విరివిగా తనిఖీ చేయాలన్నారు.
జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధి మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
జిల్లా విద్యాధికారుల సహకారంతో పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కళాశాలలు వైద్య కళాశాలలో మరియు కేజీబీవీ పాఠశాలలలో ఈ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు ఎక్కడైతే సమూహంగా ఉన్నచోట చట్టం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత పై
ప్రచార సామాగ్రి, కళాజాతతో ప్రచారం చేయాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు పాల్గొని ఈ చట్టమును అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరిండెంట్ శ్రీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఆడపిల్లలకు మరియు స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలపై మరియు చట్టాలపై ప్రచారం చేయాలన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, అబార్షన్లు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సహకారంతో గ్రామాలలో ఆర్ఎంపీలకు అవగాహన కల్పిస్తామన్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం జిల్లాలో ఈ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై, తీసుకున్న చర్యలపై వివరించినారు. జిల్లాలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని,, ఆడపిల్లలని కనాలని, ఎదగనివ్వాలని, చదివించాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో , ఇండియన్ రెడ్ క్రాస్ చైర్ పర్సన్ శ్రీమతి ఇరుగు కోటేశ్వరి మాట్లాడుతూ, ఈ చట్టమును కచ్చితంగా అమలు చేయాలని, మా సంస్థ తరఫున మా ప్రతినిధులు పాల్గొని సహకారము అందిస్తామన్నారు. ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా అటవీ అధికారులు,వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ జయ శ్యామ సుందర్, డాక్టర్ నాజియా , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మరియు జిల్లా మీడియా అధికారి అంజయ్య గౌడ్ పాల్గొనినారు.

WhatsApp Image 2024 05 21 at 17.43.06

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSCM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు…


SAKSHITHA NEWS

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSSOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…


SAKSHITHA NEWS

You Missed

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 22 views
CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 29 views
SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 26 views
SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 25 views
KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 26 views
KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 27 views
CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

You cannot copy content of this page