నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది

Spread the love

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కొత్తూరు గ్రామం వద్దగల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఇటీవల రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొదటి సొరంగము పాక్షికంగా నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది, మిషనరీలు పూర్తిగా తడిచిపోయాయి, లోకో ట్రైన్ పట్టాలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. శ్రామికులకు చెందిన వస్తువులు మొత్తము నీట మునిగిపోయాయి, అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వచ్చి చేరిన వర్షపు నీటిని బయటికి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద నీటితో నిండిన ప్రాజెక్టును చూడడానికి స్థానిక ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు

Related Posts

You cannot copy content of this page