పల్లె ప్రగతి తో మారిన తెలంగాణ గ్రామాల రూపురేఖలు.

Spread the love

The outline of Telangana villages changed with rural progress.

పల్లె ప్రగతి తో మారిన తెలంగాణ గ్రామాల రూపురేఖలు.

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

గ్రామ పంచాయితీ లకు ట్రాక్టర్లను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి.

గ్రామీణాభివృద్ధి లో దేశానికి దిక్చుచి తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న నేషనల్ వర్క్ షాప్ లో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో డా.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ నందు గ్రామీణాభివృద్ధి పై నిన్న, జరుగుతున్న నేషనల్ వర్క్ షాప్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి గా ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గ్రామ పంచాయితీ కి ట్రాక్టర్లను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు దాంతో పాటుగా పంచాయితీ ల్లో మల్టీ పర్పస్ వర్కర్లను నియమించి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచారని పట్టణాల్లో మాదిరిగా ఇళ్లకు వెళ్లి చెత్త సేకరణ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తడి, పొడి చెత్తగా తరలించడం జరుగుతోందని పేర్కొన్నారు

పల్లె ప్రకృతి వనాలను మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు క్రీడా ప్రాంగణాలు సైతం ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందన్నారు పల్లెల్లో ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లగా మార్చడం జరుగుతోందని తెలిపారు ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మించడం జరిగిందని,

ప్రతి ఇంటికి తాగు నీరు అందించడం తో పాటుగా ఇంకుడు గుంతలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గ్రామాల్లో ఉండే రైతాంగం కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు నేడు గ్రామీణాభివృద్ధి లో దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి గా ఉందని స్పష్టం చేశారు

Related Posts

You cannot copy content of this page