పోక్సో కేసు బాధితురాలికి బరోసా కేంద్రము ద్వారా కుట్టు మిషన్ అందజేత

Spread the love

ల్లా లో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య , న్యాయ , సైకలాజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యంలో నడుపబడుతున్న బరోసా కేంద్రము బాదితులు ఆర్థికంగా కూడా ఎదిగేందుకు సహయ సహకారాలు అందిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం జిల్లా లో కొత్తగా ఏర్పాటు చేసిన బరోసా కేంద్రము పోక్సో మరియు అత్యాచార కేసులలో ఉన్న ఎంతో మంది బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తోందనీ అలాగే భరోసా సిబ్బంది బాధితుల యొక్క నివాస ప్రాంతాలను సందర్శించి, వారి సాంఘిక, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భరోసా బాధిత సహాయ నిధి క్రింద 5 నుంచి 10 వేల రూ” ల వరకు తక్షణ పరిహారం ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగా ఒక పోక్సో కేసులో ఉన్న బాధితురాలికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ని దృష్టి లో పెట్టుకొని వారికి బాధితుల సహాయ నిధి కింద 7 వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్ ను ఈ రోజు బరోసా సిబ్బంది ఇవ్వడం జరిగిందనీ జిల్లా ఎస్పీ తెలిపారు. బాధిత మహిళలు బరోసా కేంద్రము కల్పిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని స్వతహాగా తమ కాళ్ళ ఫై తాము ఆర్థికంగా నిలబడగలిగి మహిళ సాధికారతలో బాగం కావాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Related Posts

You cannot copy content of this page