సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలసి కార్పొరేటర్

Spread the love
The corporator inspected the CC road works along with the GHMC officials

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్, అడ్డగుట్ట రోడ్ నంబర్ 9 లో 22.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

.
ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారం తో హైదర్ నగర్ డివిజన్ ను, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతానని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నార్నె శ్రీనివాసరావు అధికారులను ఆదేశించడం జరిగినది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది.

డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు.


ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు వల్లభనేని సుబ్బారావు, వేణు మనోహర్ రెడ్డి, రాంకుమార్, అప్పిరెడ్డి, రాజుసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page