ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు

Spread the love

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం పెద్దకాపర్తి మరియు ఉరుమడ్ల గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మర్ క్యాంప్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హ్యాపీనెస్ ప్రోగ్రాం సుదర్శన క్రియ కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ చే ఈ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు తెలియజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుందన్నారు, అదేవిధంగా దీనివల్ల మీరు యోగా యొక్క ప్రాచీన ఆచరణాలు, ధ్యానం మరియు ఉఛ్వాస, నీశ్వాసలను చక్కగా పొందుతారని జీవితంలో ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సుదర్శన క్రియ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, పొట్లపల్లి నరసింహ గౌడ్, సిలువేరు సుగుణమ్మ, చంద్రయ్య, చిలువేరు నరసింహ, చేకూరి గణేష్, గుంటోజు నాగాచారి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page