సుడా చైర్మన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్

Spread the love


Suda Corporation wishes the Chairman a Happy New Year

సుడా చైర్మన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్ కాంట్రాక్టర్స

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పుష్పగుచ్చం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కాంట్రాక్టర్లు సుడా చైర్మన్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈకార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు బత్తుల తిరుమలరావు, శ్రీహరి రాజు, తమ్మిశెట్టి వెంకటనారాయణ, అన్నం తిరుపతిరావు, దండగల రాంబాబు, సతీష్, సంక్రాంతి ప్రసాద్, పాలకుర్తి కృష్ణ, తుమ్మా అప్పిరెడ్డి, తదితర కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page