గ్రామీణ వైద్యులు నిజమైన ప్రజా సేవకులు : వనజీవి రామయ్య .

Spread the love

Rural doctors are true public servants: Vanajeevi Ramaiah.

గ్రామీణ వైద్యులు నిజమైన ప్రజా సేవకులు : వనజీవి రామయ్య .

నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గ్రామీణ వైద్యులే నిజమైన ప్రజాసేవకులని , ఇంటిదగ్గర తక్షణ వైద్య సదుపాయం వారి వల్లే మనకు లభిస్తుందని వనజీవి రామయ్య తెలిపారు . ఎస్సార్ కన్వర్షన్ హాల్లో తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం 9వ వార్షికోత్సవ సమావేశం సంఘం అధ్యక్షులు షేక్ హసన్ అధ్యక్షతన జరిగింది .

ఈ సమావేశానికి వనజీవి రామయ్య తో పాటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డి , టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు . తొలుత వనజీవి రామయ్య మాట్లాడుతూ నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదరికం అనుభవిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు . గ్రామీణ వైద్యుల హక్కులు న్యాయపరమైన పని వాటిని నెరవేర్చాల్సిందేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు .

ఏ ప్రభుత్వమైనా గ్రామీణ వైద్యుల న్యాయపరమైన హక్కుల ను కాపాడాలని కోరారు . తమ మద్దతు తెలంగాణ మైనార్టీ గ్రామీణ సంఘంకు ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు . టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ మాట్లాడుతూ పేద ప్రజలకు నిజమైన వైద్య పరంగా సేవలందిస్తున్నది గ్రామీణ వైద్యులే అని తెలిపారు . తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం కు తమ మద్దతు ఉంటుందన్నారు . వనజీవి రామయ్య , తుంబురు దయాకర్ రెడ్డి , అఫ్జల్ హసన్ లు తమ ప్రసంగంలో సంఘం వ్యవస్థాపకులు షేక్.

నజీరుద్దీన్ సంఘం బలోపేతం పై చేసిన కృషిని ప్రశంసిస్తూ , అభినందనలు తెలిపారు . అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు .ఈ సమావేశం సందర్భంగా హాజరైన పలువురు ప్రముఖ డాక్టర్లను , ముఖ్య అతిథులను తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లు భరత్ బాబు , ఎండి .అన్వర్ , వై .ప్రసాదరావు , వీరేందర్ చెట్టి , నైమా సుల్తానా , ఓమిని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , క్యూర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వై. పాషా , అభయ హాస్పిటల్ సిఇఓ కరీమ్ మరియు జిల్లా అధ్యక్షులు షేక్ హసన్ ( నేరడ ) , జిల్లా అధ్యక్షులు షేక్ హసన్ , జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ జానిమియా ,

జిల్లా కోశాధికారి , షేక్ బాబుసాహెబ్ , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖాసీం , షేక్ చాంద్ పాషా , జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ ఆషా , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహ్మద్ సాహెబ్ , ప్రచార కార్యదర్శులు షేక్ అమీర్ , షేక్ షమి , షేక్ జాని (శ్రీరాంగిరి) , కార్యదర్శులు షేక్ అబ్జల్ , షేక్ మస్తాన్ పాషా , డివిజన్ అధ్యక్షులు షేక్ జానిమియా ( మధిర ) , షేక్ రంజాన్ పాషా ( పాలేరు ) , షేక్ మౌలానా ( భద్రాచలం ) , షేక్ అఖిల్ అహ్మద్ ( ఇల్లందు ) , షేక్ పాషా ( ఇల్లందు ) , షేక్ అజిముద్దీన్ ( కొత్తగూడెం ) , జిల్లా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు షేక్ అహ్మద్వషా , షేక్ వలి ( సత్తుపల్లి ) , షేక్ షాజహాన్ షేక్ నబి , షేక్ మన్సూర్ అలి , మహిమూద్ ( గుండాల ) , షేక్ బాజీ , షేక్ రబ్బాని , షేక్ ఇమము, షేక్ మదర్ సాహెబ్, షేక్ నజీర్, షేక్ షరీఫ్ ,షేక్ అలీ , షేక్ నబీ , ఇషాక్ పాషా తదితరులు పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page