రమేష్ మారాజ్ ముదిరాజ్ (కాంగ్రెస్ పార్టీ)ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు

Spread the love


Ramesh Maraj Mudiraj (Congress Party) had a grand birthday celebration in Tandoor town.

తాండూర్ పట్టణంలో రమేష్ మారాజ్ ముదిరాజ్ (కాంగ్రెస్ పార్టీ)ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.


వికారాబాద్ జిల్లా తాండూర్ : (సాక్షిత తాండూర్ పట్టణంలో మల్కొడ్ రమేష్ ముదిరాజ్ జన్మదిన పుట్టినరోజు వేడుకలు భారీఎత్తున, జరుపుకున్నారు. వీల్యమూన్ చెందుమారాజు ముదిరాజ్ విగ్రహం హైదరాబాద్ చౌరస్తానుండి ఓపెన్ టాప్ వెహికిల్ మీదనిల్చొని బాండు భజన్త్రీల తో కాళికదేవి మందిరం ఆవరణలో,కాంగ్రెస్ పార్టీకీ చెందిన బీసీ సంఘం,ముధిరాజ్ లు ఇతర పార్టీల నాయకులు,ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.

ఆ తదుపరి అదే ఊరేగింపుగా, రైల్వే స్టేషన్, మార్వడి భజార్, భద్రప్పగుడి, చౌరస్తా మెయిన్ బజారు ద్వారా MPT హాల్ ఫంక్టనల్ చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసినారు. ఇక్కడికి బీసీ లు, ముదిరాజ్ లు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు రావటంతో హాలు ఏమాత్రం సరిపోలేదు, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ప్రభాకర్ గౌడ్ కౌన్సిలర్, భాతులవెంకటయ్య, పి జనార్దన్ రెడ్డి, యాలాల మండలం భీమయ్య, రమేష్ మారాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ, నాపూట్టిన జన్మదిన వేడుకలలో పాల్గొన్నా, బీసీ లకు, ముదిరాజ్ లకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ,ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియ జేశారు.

తాండూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కంచుకోట ఏమాత్రం చేదర లేదన్నారు,పోయిన MLA ఎన్నికల లో పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే కూడా గెలిపి oచారు, రోహిత్ రెడ్డి MLA కాంగ్రెస్ నుండిగెలిచి తెరాస పార్టీలో చేరి ప్రగల్బాలు పలుకు తున్నడని విమర్శలు చేశారు, ఈ సారి ఆరు నూరైనా వందకు రెండు వందల శాతము నేను ఖచ్చితంగా MLA గా నిలభడ గలనని కుండా భద్దలు కొట్టినట్లు తెలియ జేశారు.

జనం చప్పట్లు కేరింతల మధ్యన వేడుకలు జరుపుకున్నారు. ఇట్టి వేడుకలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ చెందు, సయ్యద్ షూకూర్, G మల్లప్పమాజీ సర్పంచ్, కే రాజ్ కుమార్,జర్నప్ప, నారాయణ మాజీ సర్పంచ్, వీరప్ప సర్పంచ్ గాజీపూర్, చెర్ల రాములు, భీమ్ శంకర్, భాతుల నాగు, లొంకా నర్సిములు, బీజేపీ క్రిష్ణముదిరాజ్, బీజేపీ హన్మంత్ సంగేమ్, రాము ముదిరాజ్,sp రవికుమార్, బోయిని నర్సిములు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page