గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని

Spread the love

ORR under Gachibowli Division

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ORR నుండి శిల్ప లేఔట్ (మైండ్ స్పేస్ )వరకు రూ. 190 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన 4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ నవంబర్ 20 తేదీన ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో జోనల్ కమిషనర్ శంకరయ్య ప్రాజెక్ట్స్ SE వెంకట రమణ,EE pwd Z1 నమ్య నాయక్ , SE శంకర్ నాయక్ , ఈ శ్రీనివాస్ , ప్రాజెక్ట్ DE హరీష్, DE రమేష్ , డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, డీడీ అనిల్ , ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ ఈ ఇంద్రదీప్ తో కలిసి ఫ్లైఓవర్ నూ పరిశీలించిన ప్రభుత్వా విప్ ఆరెకపూడి గాంధీ ..

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ. IT హబ్ హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి IT ప్రాంతాలు, రద్దీ ఉండే ప్రాంతాలలో చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని హంగులతో ,నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగినది అని , రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ తగ్గించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక ప్రాంతాల్లో పూర్తి చేసుకొని రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరియు IT ఉద్యోగులు కొరకు చేస్తున్న కృషి త్వరలో ఫలించబడుతుంది అని , అన్ని హంగులతో మరియు LED లైట్స్ తో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో నే ప్రాంభించబడుతుంది

అని, ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ఔటర్ రోడ్డు కు వెళ్ళడానికి సులబతరం అవుతుంది అని,ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, ట్రాఫిక్ తగ్గి ,సమయం , వాహనాల ఇంధనం తగ్గునని,ప్రజలకు కొంత సాంత్వన చేకూరునని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిదంగా


మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (SRDP ) పై
హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (SRDP ) ,హైదరాబాద్ ను విశ్వనగరం గా తీర్చి దిద్దే క్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు

మౌలిక వసతుల కల్పనకై ముఖ్య మంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో IT రంగం , అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివాసితున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో ముఖ్య మంత్రి KCR దూర దృష్టితో మరియు మంత్రి KTR ప్రణాళికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి SRDP ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగె విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో SRDP ప్రాజెక్ట్ లో భాగంగా తొలి ఫలితం అయిన అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం జరిగినది

అని, మరియు ప్రత్యమ్నాయ రోడ్లు ,ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు కొత్త ప్రతిపాదనల తో బ్రహ్మాండంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోకూడా అధికారులు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని,ఎక్కడ పనులు ఆపకుండా ఎన్నో స్థల సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ

కూడా ప్రజల సహకారం తీసుకోని అధికారులను సమన్వయ పర్చుకుంటూ ఇన్ని రోడ్లు అభివృద్ధి చేయడం అంటే బహుశా 50 యేండ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి సరిగా గొప్ప చరిత్ర అని చెప్పుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ,మాకు గౌరవంగా ఉందని చెప్పడానికి చాల సంతోషిస్తున్నాను అని ,అదేవిధంగా బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేయడం జరిగినది

.చాల సంతోషంగా ఉంది అని ,దుర్గం చెరువు దగ్గర నిర్మించిన రోప్ వే లేదా కేబుల్ బ్రిడ్జి ద్వారా ప్రర్యాటక ప్రాంతంగా అన్ని ప్రాంతాల ప్రజానీకానికి పోవడానికి , ట్రాఫిక్ తగ్గడానికి బ్రహ్మాండం ఐన ప్రణాళికను రూపొందించడం జరిగినది అని, మరియు మరిన్ని ప్రత్యామ్నాయ రోడ్లు అడగడం జరిగినది

అని వీటిని ప్రత్యేకంగా తీసుకోని నియోజకవర్గ అభివృద్ధికి ,ప్రజల ట్రాఫిక్ సమస్యల ఇబ్బందులను గట్టెకించే విధంగా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గ తెలియచేశారు. అదేవిధంగాఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని

ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నో ఏండ్ల

సమస్య నేటితో తిరునని, ప్రజల సౌకర్యార్థం ,ప్రజావసరాల దృష్ట్యా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగినది అని , అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page