నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు


సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ  పత్రిక నగర్ కాలనీ వాసులు నా విజ్ఞప్తి మేరకు కాలనీ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీ వాసులు ముందుకు రావడం చాలా సంతోషకరమైన రోజు అని, ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు, కాలనీ లలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయి అని , కాలనీ వాసులు ముందుకు రావడం చాలా అభినందనీయం అని , సీసీ కెమెరా ల ఏర్పాటు కు చొరవ తీసుకోవడం చాల గొప్ప విషయం అని ,శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని ,సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారం తో అవగాహన కలిపిస్తున్నారని ,ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసుల తో సమానమని, సీసీ కెమెరాల వలన కేస్ ల పరిష్కారం సులువు అవుతుంది అని, నేర శోధన ,నేర నివారణ కు ఎంతో తోడ్పడతాయి అని ,కావున అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు , సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

మహిళల,ప్రజల రక్షణకు,దొంగతనాలు ల్అరికట్టడానికి సి.సి.కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,24 గంటల పాటు నిరంతరం పనిచేసే నిఘా నేత్రలను ప్రతి కాలనీ, బస్తీలో ఏర్పాటు చేసుకోవాలి అని ,.. ప్రతి కాలనీలో,బస్తీలో ఇలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంవలన దొంగతనాలు,నేరాలు జరిగినపుడు పోలీసులకు నేరస్తులను గుర్తించడంలో మరియు కీలక సమయం లో సాక్ష్యంగా ఎంతగానో ఉపయోగపడుతాయి అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.. అన్ని కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు .కొండాపూర్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో SI ఇక్బాల్ ,పత్రిక నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ సుధాకర్, అడ్వైజర్ చంద్రకాంత్ రావు, సెక్రటరీ నాగేశ్వర్ రావు, రవి కుమార్, నారాయణ,పద్మజ, కృష్ణ రెడ్డి,నాగిరెడ్డి,రమేష్ రెడ్డి,రామ కోటయ్య, శ్రీనివాసరాజు, రామకృష్ణ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page