ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా వీధుల్లో చేరిన మున్సిపల్ కమిషనర్, సిసిఎస్ సిఐ

Spread the love

గుడివాడలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులందరితో స్నేహభావంతో ఉంటానన్న ఎమ్మెల్యే నాని….*
-ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు ప్రజలకు మంచి చేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని…
గుడివాడ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.బాల సుబ్రహ్మణ్యం, సిసిఎస్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఇ.రమణి, రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నానిను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐ రమణి, కమిషనర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే నానికు పుష్పగుచ్చాలు అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే కొడాలి నాని వేర్వేరుగా కొద్దిసేపు ముచ్చటించారు.పట్టణ అభివృద్ధి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్యే కొడాలి నాని సూచించారు. ప్రజలకు మంచి చేస్తూ అధికారులు చేసే కార్యక్రమాలకు తాను అన్ని విధాలుగా మద్దతుగా ఉంటానని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో కిలకమైన సిసిఎస్
బాధ్యతలు చేపట్టిన రమణికు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులతో తాను స్నేహభావంగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page