జమున మృతికి ఎంపీ నామ సంతాపం

Spread the love

MP condoles death of Jamuna

జమున మృతికి ఎంపీ నామ సంతాపం

ఆమె మృతి సినీ లోకానికి తీరని లోటు : నామ


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

సీనియర్ అలనాటి నటి జమున మృతిపట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నామ జమున సినీ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారన్నారు.

సినీనటిగా కళాసేవకే పరిమితం కాకుండా ఎంపీగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని నామ ప్రార్థించారు.

Related Posts

You cannot copy content of this page