కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారం

Spread the love

మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో టిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ప్రజలతో సమావేశమై కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డుల ఇంచార్జ్ లు, గ్రామ పెద్దలు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page