ట్రస్మా ఆధ్వర్యంలో ‘గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ మీట్ -2022‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

MLA who started the ‘Games, Sports, Literary Meet-2022’ under the leadership of Trasma.

ట్రస్మా ఆధ్వర్యంలో ‘గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ మీట్ -2022‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ మీట్ -2022 ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్లార్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో సుమారు 100 స్కూళ్ల విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు.

రాబోయే రోజుల్లో ఇలాంటి క్రీడలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెద్దఎత్తున క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి, శేఖర్ రావు, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, ప్రెసిడెంట్ వనజ అశోక్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి, ట్రెజరర్ నర్సిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు ఛాయాదేవి, తిరుపతిరెడ్డి, పవన్ కుమార్,

పరశురామ్ గౌడ్, మారుతి రేణుక, శ్రీకాంత్, సారిక, జాయింట్ సెక్రటరీలు గురుమూర్తి, సుబ్బారెడ్డి, జిఎస్ రాజు, బలవంత్ కుమార్ యాదవ్, పద్మ, కామేశ్వరి, పర్వీన్ సుల్తానా, డిస్టిక్ బాడీ ఈశ్వర్ రెడ్డి, బాలరాజు, ఆదినారాయణ, శానా ఆఫ్రోజ్, జోసెఫ్, ఉపేందర్, గండిమైసమ్మ ప్రెసిడెంట్ ప్రవీణ్, జనరల్ సెక్రెటరీ నందిని

ట్రెజరర్ పుష్ప మరియు నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సుద్ అలీ, కస్తూరి బాల్ రాజ్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page