సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

[1:04 PM, 4/27/2024] Sakshitha: సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్క బొర్లా పడడం ఖాయం : ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి …
[1:07 PM, 4/27/2024] Sakshitha: *సాక్షిత * : కుత్బుల్లాపూర్ లో కమలానికి షాక్… ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న దాదాపు 200 మంది బిజెపి యువ మోర్చాకు చెందిన నాయకులు, కార్యకర్తలు..*

128 – చింతల్ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజల కోసం రూపొందించి హామీలను మించిన పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచిందని, కానీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రతిపక్ష పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుందని సంక్షేమాన్ని మరిచి రాజకీయాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని, మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడడం ఖాయమని, మరో మారు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని దాని పర్యవసానమే నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలయ్యాయన్నారు. మళ్లీ మనకు మంచి రోజులు రావాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యమన్నారు . మరోవైపు గత 25 ఏళ్లుగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉండగా, మరోవైపు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేని ఈటెల రాజేందర్, పట్నం సునీత మహేందర్ రెడ్డి లు ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. మన కష్టాలు పోవాలంటే మన సంక్షేమం కోసం, మనకోసం ఆలోచించే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బీజేవైఎం కన్వీనర్ సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : సాయిరాం రెడ్డి, శ్రీకాంత్, మనీష్, భాగ్యలక్ష్మి, తేజ, రామ్ రెడ్డి, సోమిరెడ్డి, అనిల్ రెడ్డి, సుజిత్ రెడ్డి లతో పాటు మరో 200 మంది…

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ 128 డివిజన్ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, వెంకటేష్ గౌడ్, బసవరాజు, ప్రభాకర్ గుప్తా, వహీద్, ఇస్మాయిల్, శ్రీశైలం, కోట ప్రసాద్, షౌకత్, రఘు, మహిళా నాయకురాలు స్వప్న, స్వర్ణలత, రేణుక, సరిత, సావిత్రి, రాధ, 125 డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, పరిశే శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ కమలాకర్, మూసాఖాన్, చెట్ల వెంకటేష్, బాబి చౌదరి, ఇమ్రాన్ భాయ్, నవీన్, సయ్యద్ ఆసిఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page