నూతన అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

Spread the love

హైదరాబాదులో సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు 464 అంబులెన్స్ లోను ప్రారంభించడం జరిగినది .

గద్వాల జిల్లా కేంద్రంలోని నందు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గద్వాలకు నియామకమైన 108,102 అంబులెన్స్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ ఎమ్మెల్యే కి ఛైర్మన్ కి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు

ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి లో అంబులెన్స్ కేటాయించాలంటే గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగినది. నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలు ఆరోగ్య పదమైన ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏదైనా ప్రమాదం గురైతే వారికి ఆసుపత్రికి వెళ్లే విధంగా అంబులెన్స్ ను కేటాయించడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కొరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రవేట్ హాస్పిటల్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్యంలో అందిస్తూ గ్రామీణ ప్రాంతాలలో పల్లె దఖానాలు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా మెరుగైన వైద్యము అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి వ్యాధి వచ్చిన ఎలాంటి వైద్య అవసరం పడిన ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా మన ప్రాంతంలోని వైద్యం అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర వైద్యం శాఖ అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, ఎంపీపి రాజారెడ్డి జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి నరహరి గౌడ్, శ్రీను, దౌలు, మహేష్ , మల్డకల్ మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు , ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీతారాం రెడ్డి, షుకర్, జనార్దన్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, సుధాకర్, భగీరథ వంశీ, కమ్మరి రాము, కురుమన్న, చిన్న, నాయకులు కార్యకర్తలు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page