హుస్నాబాద్, కాజీపేట లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభలు

Spread the love


వరంగల్‌ హుస్నాబాద్‌: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25 గంటల వరకు రూ.33.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ నం, 2.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.

రూ.181 కోట్లతో అభివృద్ధి పనులు

హనుమకొండలో రూ.181 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్‌లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్‌ కాలేజీలో ఇన్నోవేషన్‌ హబ్‌ను, సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కాజీపేటలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. గురువారం బహిరంగ సభ స్థలాన్ని మంత్రి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ పరిశీలించారు.

Related Posts

You cannot copy content of this page