మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ

Spread the love

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ .
సాక్షిత,: కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, పాఠశాల విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులకు, కాలనీ వాసులకు బస్తీ వాసులకు తెలియచేయునది ఏమనగా వినాయక చవితికి పర్వదినం ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం GHMC ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుంది అని,మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే నివాసం మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్ కార్యాలయాలలో విరివిగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని ,
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లోని ప్రతి కాలనీ కి మరియు వెల్ఫేర్ అసోసియేషన్ కి ఈ యొక్క మట్టి వినాయకులను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుంది అని, ఈ చక్కటి సదావకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వవిప్ గాంధీ పేర్కొన్నారు.
మట్టి వినాయకులను పూజించి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం మరియు చెరువులను కలుషితం చేయకుండా వీలైనంత వరుకు మట్టి వినాయకులను మన యొక్క స్వగృహం ప్రాంగణంలో నే నిమర్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని , అదేవిధంగా పర్యావరణ హితం మట్టి గణపతులను పూజించాలని ఈ విషయంలో మహిళలు ముందుండాలని, ప్రతి ఒక్కరికి అవగహన కలిపించాలని, మట్టి వినాయకులను పూజించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం పర్యవరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఓక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయి అని ,పర్యావరణ సమతుల్య త దెబ్బ తింటుంది అని కావున భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కే శ్రీరామ రక్ష అని, మొక్కలు నాటడం మనందరి సామాజిక బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఊట్ల చంద్రారెడ్డి, బస్తి కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింహులు ముదిరాజ్ , కనకా రెడ్డి, ముత్యం వెంకట్ రెడ్డి, రాములు ఆంజనేయులు, రవి,డ్వాక్రా సంఘం సభ్యులు కె. పద్మ, బి.విజయలక్ష్మి, ఆర్.ఆర్.విధ్యాభవన్ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం , పాఠశాల విద్యార్థులు, జి.హెచ్.ఎం. సి సిబ్బంది, బస్తి వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page