శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని
సాక్షిత : శాస్త్రొక్త పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే….*
-అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండలమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి….


-త్వరగతిన నిర్మాణం పూర్తి చేసుకొని, మండపం భక్తులకు అందుబాటులోకి వస్తుంది….
గుడ్లవల్లేరు మండలంలో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ వారి దేవస్థానంలో నూతనంగా నిర్మించనున్న దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులను, భూమి పూజ నిర్వహించి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.తొలుత పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని, వేద పండితుల మంత్రొచ్చరణల మధ్య అమ్మవారికి సమర్పించి తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలక్షేప మండప నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొడాలి నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నానికు వేద పండితులు వేద ఆశీర్వాదాలు అందించగా, దేవదాయ శాఖ అధికారులు దేవస్థాన సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఫోటో,ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండాల అమ్మవారి ఆశీస్సులతో యావత్ ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేరు విధంగా గుడివాడ నియోజకవర్గంలోని దేవాలయాలను ప్రభుత్వ నిధులతో పాటుగా దాతల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనాల పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.


ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కానూరి సురేష్ , ధర్మకర్తల కమిటీ చైర్మన్ శేషం గోపి, సభ్యులు కొమ్మనబోయిన రవిశంకర్, డోకాల భాగ్యలక్ష్మి, పామర్తి వెంకటస్వామి,బాడిగ లీలా సౌజన్య, నారేపాలెం విజయనిర్మల, వైఎస్ఆర్ సీపీ నాయకులు
పాలేటి చంటి, కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,మండల వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు పెన్నేరు ప్రభాకర్ రావు, యూత్ అధ్యక్షుడు గుదే రవి, శేరిదగ్గుమిల్లి ఎంపిటిసి ముక్కు సోమేశ్వరరావు, వడ్లమన్నాడు ఎంపీటీసీ మండా దిలీప్ కుమార్ , వడ్లమన్నాడు సర్పంచ్ కటికల జ్యోతి,
డోకిపర్ సర్పంచ్ గోసాల జ్యోతి, గాదెపూడి సర్పంచ్ వీర్నాల లక్ష్మణరావు,పోలిమెట్ల సర్పంచ్ అడుసుమల్లి రామ్మోహన్ , చంద్రాల సర్పంచ్ కాలిశెట్టి అర్జున్ రావు ,
గిరి బాబాయ్ ,గరికపాటి గోపి,మంటాడ చలమయ్య,
అబ్దుల్ రహీం,కుంచపర్తి సాయి,అప్పినేడి నాంచారయ్య,అప్పినేడి భాస్కరరావు, పెనుమాల రంగారావు,కిషోర్ నాయుడు,బెజవాడ సముద్రుడు ,
కొడాలి ప్రసాద్,చందన నాగన్న నాయుడు,గోసాల కుమార్,గోసాల లవ కుమార్,అల్లూరి ఆంజనేయులు,
పామర్తి హరిబాబు,నిమ్మగడ్డ కుటుంబరావు,సాయన హరిబాబు,మహా రెడ్డి మురళి, పెద్ద సంఖ్యలో భక్తులు, దేవదాయశాఖ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page