రవీంద్ర భారతిలో కట్టెకోలకు ఘన సత్కారం అభినందించిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల

Spread the love

రవీంద్ర భారతిలో కట్టెకోలకు ఘన సత్కారం అభినందించిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన
అక్షర కౌముది సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవంలో ఖమ్మంకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు కట్టెకోల చిన నరసయ్యను అక్షర కౌముది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. అక్షర కౌమిది సంస్థ గత ఏడాది కాలంగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా వాట్సప్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులతో నిర్వహించిన పౌర్ణమి కవితల పోటీలలో చిన నరసయ్య విజేతగా నిలిచారు. ఆయనను తృతీయ వార్షికోత్సవంలో శాలువాతో సత్కరించి మేమంటో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారితో పాటు పలువురు ప్రముఖులు ఆయనను అభినందించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అక్షర కౌముది అధ్యక్ష కార్యదర్శులు తులసి వెంకట రమణాచార్యులు, మూర్తి శ్రీదేవి, నిర్వాహకులు తాళ్లూరి వెంకటకృష్ణ, ఐనంపాటి శ్రీలక్ష్మి, కాలేశ్వరం శంకరం, పత్తిపాటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page