ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు1,26,500 /- చెక్కు రూపేణా చెల్లించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

engineering-college-fee-126500-paid-by-check-govt-whip-arekapudi-gandhi

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థికి ఉన్నత చదువులకోసం స్వంత డబ్బులతో ఈ విద్యా సంవత్సరంకు గాను ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు1,26,500 /- చెక్కు రూపేణా చెల్లించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

.

.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వీరయ్య యాదవ్ గతంలో మరణించడం తో మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి ముగ్గురి పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులకు ఆటంకం కల్గకూడదనే ఉద్దేశ్యంతో వారు చిన్నప్పటి నుండి నా స్వంత డబ్బులతో చదివిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాలలో వెలుగులు నింపడానికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ముగ్గురు పిల్లలను చదివించడం చాలా సంతోషముగా ఉంది అని, పెద్ద కుమార్తె గీత ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని, ఇటీవల సాఫ్ట్ వెర్ గా స్థిరపడింది అని, చిన్న కూతురు హర్షిత భద్రుక కళాశాలలో పీజీ చదువుతుంది అని , వారి కుమారుడు సుమంత్ మల్లారెడ్డి కళాశాల లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అని  ఇంజనీరింగ్ విద్యానభ్యసించడానికి గాను   కాలేజీ ఫీజు ల నిమ్మితం ఈ విద్య సంవత్సరంకు గాను 1,26,500/- రూపాయలను చెక్కు రూపేణా ఇవ్వడం జరిగినది అని, తండ్రిని కోల్పోవడం,వారి ఆర్థిక స్థోమత లేక పేదవారు కావడం వలన కాలేజీ ఫీజు కట్టుకోలేని స్థోమత లేకపోవడం  చదువలకు ఆటంకం కల్గకుండా ,విద్యార్థి భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్  ఫీజు 1,26,500 /- రూపాయలను చెక్కు రూపేణా  కట్టడం జరిగినది అని, గతంలో వారి తండ్రి చనిపోతే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొని వారిని ఉన్నత చదువులు ప్రభుత్వ విప్ గాంధీ చదివిస్తున్న సంగతి విదితమే 

వారి ఆర్థిక పరిస్థితికి చలించి ప్రభుత్వ విప్ గాంధీ ముందు కు వచ్చి ఇద్దరి ఆడపిల్లలను గీత,హర్షితలను మరియు సుమంత్ లను దత్తత తీసుకొని  చదివించడం జరుగుతుంది ,గీత అనే అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఇటీవల సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా స్ధిరపడింది ,హర్షిత పీజీ చదువుతుంది.ఇద్దరి భవిష్యత్  కు ఆటంకం కల్గకుండా ,  ఉన్నత  చదువులకోసం స్వంత డబ్బులతో  కాలేజీ ఫీజు కట్టడం జరిగినది అదేవిదంగా అక్కలను స్ఫూర్తి గా తీసుకొని చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ,మరియు ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని ఉన్నత లో స్థిరపడలని ప్రభుత్వ విప్ గాంధీ విద్యార్థి సుమంత్ ను ఆశీర్వదించడం జరిగినది .

ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని విద్యార్థికి చెప్పడం జరిగినది . దీనికి విద్యార్థి మరియు కుటుంబ సభ్యులు స్పందిస్తూ  కాలేజీ ఫీజు కొరకు  ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పడం జరిగినది ,మంచిగా చదువుకొని ,పది మందికి ఉపయోగపడేలా ఉంటానని ,నా పై చదువులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీ ని జీవితం లో ఎప్పటికి మర్చిపోలేనని విద్యార్థి చెప్పడం జరిగినది .

Related Posts

You cannot copy content of this page