రోడ్డు భద్రత పై డిజిపి

Spread the love

రోడ్డు భద్రత పై డిజిపి
వీడియో కాన్ఫిరెన్స్ కి హాజరైన యస్.పి రాజేంద్రప్రసాద్

రాష్ట్రంలో రహదారుల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ గురువారం కమిషనరేట్లు, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి సూచనలు సలహాలను అందించారు. జిల్లాలో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ పట్ల తీసుకుంటున్న చర్యలు ప్రణాళికలను యస్.పి వివరించారు. భారీకెడ్స్ ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, చెట్ల పొదలు తొలగించడం, కూడళ్ల వద్ద మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద నివారణ చర్యలు, ఇంజనీరింగ్ లోపాలను సవరించడం, సైన్ బోర్డ్ లు ఏర్పాటు, స్పీడ్ గ్రేకర్లు ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, స్పెషల్ డ్రైవ్ ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, స్పీడ్ లిమిట్, అనాతరైజ్డ్ పార్కింగ్, వాహనాల అనుమతి పత్రాల పై ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని యస్.పి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎస్పి లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, రవి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ నరసింహ, మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్స్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page