కొర్లగుంట రోడ్ విస్తరణతో ప్రజలకు సౌకర్యం : కమిషనర్ అనుపమ అంజలి

Spread the love

Convenience for people with widening of Korlagunta Road: Commissioner Anupama Anjali

కొర్లగుంట రోడ్ విస్తరణతో ప్రజలకు సౌకర్యం : కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : తిరుపతి కొర్లగుంట ప్రధాన రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ సూచనలు జారీ చేస్తూ విస్తరణలో భాగంగా 195 ఇండ్లను తొలగించే పనులు పూర్తి కావడంతో రహదారి విస్తరణకు మార్గం సులువైన విషయాన్ని ప్రస్థావిస్తూ వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. కొంతమందికి టిడిఆర్ బాండ్లను ఇవ్వాల్సి వుండడాన్ని కమిషనర్ ప్రస్థావిస్తూ వెంటనే బాండ్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే విస్తరించిన రోడ్డు వైపు అండర్ డైనేజ్ కాలువలు, అండర్ విధ్యుత్ లైన్ పనుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా భూగర్భ డ్రైనేజి కనెక్షన్లను ఇళ్ళకు వెంటనే ఇచ్చే పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే విస్తరణ రోడ్డుకు అవసరమైన పనులు పూర్తి కావస్తున్నాయని, వీలైనంత త్వరగా మిగిలిన ప‌నులను పూర్తి చేసి మరో రెండు నెలల లోపు పూర్తి చేసేలా అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ అనుపమ అంజలితో బాటు కార్పొరేటర్ పుల్లూరు అమరనాధ్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, డిఈ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page