రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ఐ సుధాకర్

Spread the love

ASI Sudhakar died in a road accident

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ఐ సుధాకర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన పోలీస్ అధికారులు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ఐ సుధాకర్
మృతదేహాన్ని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,
పోలీస్ అసోసియేషన్


సందర్శించి నివాళులు అర్పించారు. ఖమ్మం నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూసుమంచి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సుధాకర్ మృతిచెందారు. ఖమ్మంజిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్


రోజు వారి విధులలో భాగంగా విధులు నిర్వహించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపం నుంచి మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొనడంతో సుధాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారు.

మృతి వార్త తెలిసిన పోలీస్ సిబ్బంది భౌతికాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దహన సంస్కారం ఖర్చులు నిమిత్తం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సిఐ సతీష్ , పోలీస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ జానీమియా, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page