AP CRDA వారికి 1134.58 ఎకరాలకు గాను రూ. 1162.95 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు

Spread the love

తరాల చరిత్ర, తలరాత మార్చగల నాయకులు అంటే ఎవరు, వీళ్లే అనేది ఈ ప్రపంచం గుర్తించింది, ఈ మాట నిజమేనా! ఆ నాయకులు ఎవరు… వీళ్లేనా…

గన్ లోంచి వచ్చిన బుల్లెట్ ఎంత సూటిగా తన లక్ష్యాన్ని చేరుతుందో అలాగే తన మాట నిలుపుకోవడం కోసం తపన పడే వ్యక్తి మన జగనన్ననైతే….

మరొకరు
తన పొలంలో పెరిగిన కలుపును ఎలాగైతే కొడవలితో పెరికి వేసే రైతులాగా అవినీతి కలుపు మొక్కలను ఏరి వేసి రైతు నాయకుడు మన ఆర్కే అన్న….

వీరిద్దరూ కలిసి సాధించిన విజయమే ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 45 మున్సిపల్ పరిపాలన శాఖ తేదీ:31-3-2023.

వివరాలు..
పై ప్రభుత్వ ఉత్తర్వులలో అమరావతి రాజధాని లో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా AP CRDA వారికి 1134.58 ఎకరాలకు గాను రూ. 1162.95 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

సొంత ఇల్లు అనేది ప్రతి మనిషికి ఒక కల…ఆ కల సాకారానికై ప్రతి మనిషి ఎన్నికల సమయాలలో నాయకుల మాటనమ్మటం, ఓటేయటం, ఓడిపోవటం మన మంగళగిరిలో దశాబ్దాలుగా నడిచింది….
2019 లో జగనన్నను నమ్మిన పేదలు,సామాన్యులు, అందరూ….ఆర్కేను ఆదరించటం…న్యాయస్థానాల బూచితో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా…ప్రజాసేవే లక్ష్యం గా, సొంతఇంటి కలను సాకారం చేయటానికి త్వరలో ముహూర్తం ఖారారు చేయబోతున్న జగనన్నకు, మంగళగిరి మహర్షికి…జేజేలు పలుకబోతున్న మంగళగిరి ప్రజలు.

ఈ విషయంలో మంగళగిరి నియోజకవర్గంలోని సుమారు 25 వేల మంది నిరుపేదలకు నివేసిన స్థలాలు మంజూరు చేయుటకు కార్యచరణ మొదలు కాబడినది. మొత్తం మీద సుమారు 55 వేల మంది మహిళలకు జగనన్న ఆర్కే గారి ద్వారా సొంత ఇంటి కల నిజం కాబోవుచున్నది…

ఇది మన మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సత్యం.

ఈ నియోజకవర్గంలో 99% మంది పేద అక్క, చెల్లెమ్మలకు సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుచున్నది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page