ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం

Spread the love

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పిఎసిఎస్ లో ఇప్పటివరకు 1,91,426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పిఎసిఎస్ ఇంచార్జి వెంకటరెడ్డి కలెక్టర్ కు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతు ఆవు దొడ్డి వీరయ్య 120 బస్తాల ధాన్యాన్ని తీసుకొని రాగా ఇంత తొందరగా ధాన్యం కొనుగోలు, ఎగుమతి, దిగుమతులు గతంలో ఎప్పుడు కాలేదని ఆయన తెలిపాడు. అలాగే అదే గ్రామానికి చెందిన ఎం.రోశయ్య అనే రైతు 275 బస్తాల ధాన్యాన్ని తీసుకురావడం జరిగిందని చాలా తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఈసారి కొనుగోలు కేంద్రాల విషయం లో కలేక్టర్ మంచి ఏర్పాట్లు చేసారని, పెద్ద లారీలను పంపి త్వరగా ఎగుమతులు అయ్యేలాగా చూశారని తెలిపారు. మొదళ్ళ గంగయ్య 155 బస్తాల ధాన్యాన్ని తీసుకొనిరాగ కోనుగోలు వేంటనె జరిగిందని తెలిపాడు. మిల్లుల వద్ద కూడా ధాన్యాన్ని దిగుమతి త్వరగా జరుగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులు, ఎగుమతి, దిగుమతుల గురించి మేనేజర్ వెంకటరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటివరకు 12,755 రైతుల నుండి 1,47,820 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని రైతుల ఖాతాలో 159 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్టీవో సురేష్ రెడ్డి, పిఎసిఎస్ మేనేజర్ వెంకటరెడ్డి, అధికారులు, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page