14వతేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు-మాజీ మంత్రి పేర్ని నాని

Spread the love

గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్

*సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని.

పేర్ని నాని కామెంట్స్

*ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు.

*నియోజకవర్గంలోని జొన్నపాడులో మధ్యాహ్నం బ్రేక్ తీసుకుంటారు.

*అక్కడ నుంచి రోడ్ షో గా….. నాగవరప్పాడులోని మేమంతా సిద్ధం సభ వేదిక వద్దకు సాయంత్రం మూడు గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు.

*మేమంతా సిద్ధం సభలో ప్రజలకు దగ్గరగా వైసిపి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందో జగన్ వివరిస్తారు.

*వైసిపిపాలన వల్ల ఏ.ఏ వర్గాలకు మంచి జరిగిందో చెబుతూ ….. భవిష్యత్తులో చేయ్యబోయే కార్యక్రమాలను సీఎం జగన్ తెలియజేస్తారు.

*ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు విజ్ఞప్తి చేయని విధంగా….

*ఆత్మవిశ్వాసంతో మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే మాకు ఓటు వేయండని దమ్ముగా ఓటు అడుగుతున్న నాయకుడు సీఎం జగన్.

*నాగవరప్పాడులో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…. కార్యకర్తలు…. కుటుంబ సభ్యులు…. గుడివాడ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సభలో పాల్గొని ….సిఎం జగన్ ను…. ఎమ్మెల్యే నానిను ఆశీర్వదించాలి.

*మేమంతా సిద్ధం సభతో పాటుగా పాటుగా….. పుట్టగుంట నుండి జొన్నపాడు, గుడివాడ ఏలూరు రోడ్డు, నెహ్రూ చౌక్ , బస్టాండ్ , ఆటోనగర్ , బొమ్ములూరు, అంగలూరు, గుడ్లవల్లేరు, కౌతవరం, వడ్లమన్నాడు,రెడ్డిపాలెం వరకు జరిగే సీఎం జగన్ రోడ్ షోలో ప్రజానీకం…. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము…

Related Posts

You cannot copy content of this page