13 లక్షల 61 వేల రూపాయల సీఎం ఆర్ధిక సహాయ నిధి చెక్కు

Spread the love

13 lakh 61 thousand rupees CM financial assistance fund check

సాక్షిత : వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని 8 మంది బాధితులకు వచ్చిన 13 లక్షల 61 వేల రూపాయల సీఎం ఆర్ధిక సహాయ నిధి చెక్కులను వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ
గతంలో వినుకొండ పట్టణంలోని పెద్ద నాల్సా బజారుకు చెందినా 1.షేక్. హీనా 22 సం:లు (MA) చదువుతున్నది, 2.షేక్. ఆయేషా సిద్ధిక 18 సం:లు (Inter) చదువుతున్నది, 3.మొహమ్మద్ ఫైజుల్లా ఖాన్ 17 సం:లు (SSC) చదువుతున్నాడు. వీరు గతంలో గుండ్లకమ్మ వాగులో ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయారని, వీరి తల్లి, తండ్రులు కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకున్నారని,

బహు పేద కుటుంబానికి చెందినవారని తెలుసుకొని తాను మరియు పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కృషితో మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి నేడు వారికి సీఎం ఆర్ధిక సహాయ నిధి ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.

అంతేకాక, అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న 5 మందికి సీఎం ఆర్ధిక సహాయ నిధి ద్వారా 7,61,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేని పేదలను ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది అన్నారు.

ఆరోగ్య శ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చాలా రకాల వ్యాధులను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పధకంలో చేర్చడం జరిగిందని, అన్ని వైద్య సౌకర్యాలు, ఆయా విభాగాల్లో నిపుణులు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందని ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలో చికిత్సను పొందవలసినదిగా కోరారు.

ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆసుపత్రి యాజమాన్యం వారు నగదును డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యాక్రమంలో వినుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మండలాల వారిగా CMRF వివరాలు
వినుకొండ టౌన్:6,00,000/-
నూజెండ్ల:5,80,000/-
శావల్యపురం: 1,65,000/-
బొల్లాపల్లి: 16,000/-
మొత్తం: 13,61,000/-

Related Posts

You cannot copy content of this page