ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ

Spread the love

సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ను అభివృద్ధి చేసి, మంచి గుర్తింపు తీసుకువచ్చిన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని… ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజ నరసింహ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడుతానని…
తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు..!!

సూర్యాపేట ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గా డాక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్ సమయంలో రోగుల కు మెరుగైన వైద్యం అందించి విశేష సేవ చేశారు..!!

ఏరియా ఆసుపత్రి అభివృద్ధి విషయంలో డాక్టర్ మురళీధర్ రెడ్డి ముఖ్య భూమిక పోషించి, మెప్పించారు..!!

మురళీధర్ రెడ్డి బదిలీ విషయం జిల్లా మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి గారితో చర్చించి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి సూర్యాపేటకు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం మురళీధర్ రెడ్డి లాంటి మంచి అధికారులను కోల్పోవడం వల్ల మన ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయని పటేల్ రమేష్ రెడ్డి అన్నారు..!!

Related Posts

You cannot copy content of this page