తిరుపతి లో ట్రాఫిక్ కష్టాలు ఉండవు

Spread the love

There will be no traffic problems in Tirupati

తిరుపతి లో ట్రాఫిక్ కష్టాలు ఉండవు
శరవేగంగా మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు
మేయర్ డాక్టర్ శిరీష

మాస్టర్ ప్లాన్ రోడ్డు అభివృద్ధి చేస్తాం
కమీషనర్ హరికృష్ణ

ప్రజల సహకారంతోనే మాస్టర్ ప్లాన్ రోడ్డు
ఉప మేయర్ భూమన అభినయ్

సాక్షిత : నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసమే మాస్టర్ ప్లాన్ రోడ్లను శరవేగంగా పూర్తి చేస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.
నగర అభివృద్దే ద్వేయంగా పనిచేస్తున్న నగరపాలక కౌన్సిల్ నిర్ణయాలకు సహకరించి తిరుపతి ట్రాఫిక్ కష్టాలు తీరడం కోసం ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం కొరకు సహకరిస్తున్న ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే నేడు మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తికావస్తున్నాయని అన్నారు.


నగరంలో ఏర్పాటు చేస్తున్న ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్లను గురువారం కమిషనర్ హరికృష్ణ, ఉప మేయర్లు భూమన అభినయ్, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, అధికారులు తో కలిసి మేయర్ డాక్టర్ శిరీష రోడ్డు విస్తరణ జరుగుతున్న సందర్భంగా కాలినడకన రోడ్డు పనులు పరిశీలిస్తూ నగర అభివృద్ధికి తోడ్పడాలని ప్రజల్ని కోరారు.

కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు చూశాక తన వంతు నగరపాలక మరియు తుడా ద్వారా అభివృద్ధిలో సహాయ, సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా సమయం ఆదా అవుతుందన్నారు.

ఉప మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ నగర ప్రజలు సహకారంతోనే మాస్టర్ రోడ్డులు పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు అధికారులతో పర్యటిస్తూ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ పూర్తి చేసే దానికి నాయకులు, నగర ప్రజలు సహకారంతోనే త్వరగా పూర్తి చేస్తున్నామని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ సునీత, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, నరేంద్ర, తమ్ముడు గణేష్, ఉమా అజయ్, అనిల్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ ఇమామ్, అధికారులు యం.ఈ.వెంకట్ రామిరెడ్డి,డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, ఏ.సి.పి షణ్ముగం,టి.బి.ఓ.లు, సర్వేర్లు దేవానంద్, మురళి తదితరులు వున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page