మహిళా సంఘం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి

Spread the love

The wife of MLA GMR participated in the anniversaries of the Women’s Association

మహిళా సంఘం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి
-మహిళలకు దుప్పట్లు పంపిణీ


సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని మా అంభీ మహిళా సేవా సమితి 5’వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ , టిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి , గూడెం కల్పన రెడ్డిలు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

ముందుగా మున్సిపాలిటీలో సంఘం మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. సేవా సమితి సంఘం మహిళలు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.

సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు సంఘం తరపున శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘంలోని 370 మంది మహిళలకు ఈ సందర్భంగా ఆమె దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను సంఘం మహిళలు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వి.హన్మంత్ రెడ్డి (బొల్లారం మున్సిపల్ తెరాసా పార్టీ అధ్యక్షుడు), కౌన్సిలర్స్ వి.నీహారిక , గోపాలమ్మ , రాధా , వి.యాదిరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , వి.వరప్రసాద్ రెడ్డి , సందీప్ , ప్రమీల , దుర్గావతిదేవి, సంగీత , అర్పిత , నాయకులు నరేందర్ రెడ్డి , దిననాథ్ , రాజారాం , చంద్రశేఖర్ , లక్కన్ , రవితేజ గారు, పింటు , మా అంబీ మహిళా సేవా సమితి సభ్యులు, తదితర మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page