మంత్రి డాక్టర్ సీదిరికి ఘన స్వాగతం పలికిన అంబుగాం పంచాయతీ ప్రజలు

Spread the love

The people of Ambugam Panchayat gave a warm welcome to Minister Dr. Sidiri

మంత్రి డాక్టర్ సీదిరికి ఘన స్వాగతం పలికిన అంబుగాం పంచాయతీ ప్రజలు

అడుగడుగునా హారతి తిలకాలతో సత్కరించిన మహిళలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మందస మండలం అంబుగాం పంచాయతీ పరిధిలో సర్పంచ్ తిరునగరి వెంకమ్మ సవరయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖమాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు

మంత్రి డాక్టర్ సీదిరి కి ఘనంగా స్వాగతం పలికిన అంబుగాం పంచాయతీ పెద్దలు, మహిళలు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు

గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సుమారు రూ 8లక్షలతో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ తరువాత ఘనంగా మొదలైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

ఈసందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ ని పరిశీలించి అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి

అనంతరం అంబుగాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖమాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page