కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల బృందం

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్ తో పాటు జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని బ్లాకుల గదులను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లకు గాను గదుల విస్తీర్ణాన్ని పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఈవీఎం లు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు పరిశీలించారు.భద్రతా తదితర అన్ని చర్యలు పకడ్బందీగా ఉండేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, యువరాజ్, ట్రైనీ ఏఎస్పీ మౌనిక, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్ది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page