తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

Spread the love


The MLA examined the arrangements for the Telangana National Unity Diamond Festival

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ట్రాఫిక్ అధికారులతో కలిసి పరిశీలించారు.

15 వేల మందితో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ గ్రౌండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page