స్కిల్ స్కామ్‌లో నారా లోకేష్‌కు భారీ ఊరట..కేసును కొట్టేసిన హైకోర్టు..

Spread the love

సాక్షిత: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్‌కు భారీ ఊరట లభించింది. లోకేష్‌పై స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని కోర్టుకు తెలిపింది సీఐడీ. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపింది సీఐడీ. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు ధర్మాసనం. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు రాగా.. సీఐడీ ఇచ్చిన సమాధానం విని, కేసును క్లోజ్ చేసింది ధర్మాసనం.

Cf12e18a E2b8 43c8 8326 4ffaa3b2cb29

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page