సామాన్యుల రాజకీయ ప్రత్యామ్నాయం అఫ్ మాత్రమే!

Spread the love

The common man’s political alternative is only off!

సామాన్యుల రాజకీయ ప్రత్యామ్నాయం అఫ్ మాత్రమే!


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సామాన్యుల రాజకీయ ప్రత్యామ్నాయం అమ్ఆద్మీపార్టీ మాత్రమేనని అఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజేషన్ & ట్రైనింగ్ కన్వినర్ డా.దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కెమిస్ట్రీ &డ్రగ్గిస్టు భవన్ లో నల్లమోతు తిరుమల రావు అధ్యక్షత న జరిగిన అఫ్ ఖమ్మం పార్లమెంట్ విస్తృత స్థాయి వాలంటీర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు.

ధనం, అదికారదుర్వినియోగం, అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్య వ్యవస్థ నే కలుషితం చేస్తున్న రాజకీయ పక్షాలకు బుద్ది చెప్పెందుకు అఫ్ పార్టీని ఆదరించడం మే సామాన్యులకు మిగిలిన ప్రత్యామ్నాయం గాఆయన పేర్కొన్నారు.దేశం మోత్తం కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ వైపు ఎదురుచూస్తుంది, ఎలాంటి లోటు లేకుండా, మిగులు బడ్జెట్ తో నాణ్యమైన ఉచిత విద్యా,వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వం ప్రజల పాలిట సేవకుడిగా పనిచేస్తుందని అన్నారు

.ప్రజల హక్కులను కాపాడడం,ప్రజలపన్నులు ప్రజలకే చెందేలా చేయడంలో కేజ్రీవాల్ విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.అఫ్ ఖమ్మం జిల్లా కన్వినర్ నల్లమోతు తిరుమల రావు మాట్లాడుతూ దేశానికి తదుపరి ప్రధాని కేజ్రీవాల్ మాత్రమేనని అన్నారు

.ప్రస్తుతం కేంద్రంలో అధికారం లో ఉన్న బిజేపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లు ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించారని,ప్రజాసమస్యలు చర్చకు రాకుండా కొట్టు-తిట్టు డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. సమావేశంలో అశ్వారావుపేట ఇన్చార్జి చరఫా పాపారావు దొర, కొత్తగూడెం ఇన్చార్జి గండపనేని సతీష్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి హసన్, ఖమ్మం పట్టణం ఆప్ కన్వినర్ యుండి గఫూర్,

ముస్లీం మైనారిటీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు హమీద్, ఇబ్రహీం,ఉపేందర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం నూతనంగా అఫ్ లో చేరిన వారికి డా.దిడ్డి సుధాకర్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.అఫ్ లో చేరిన వారిలో బోనకల్లునుండి గంధం పుల్లయ్య, ఇల్లెందు నుండి కూరపాటి గోపాలరావు, ఖమ్మం నుండి రెహనాఖాన్, అజ్మత్ ఉన్నీసా బేగం, ఫర్జానా, ఫహిమా, ఇస్రాత్, సోఫియా, ఓడిన్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page