కొయ్యలగూడెం ఇంటింటి ప్రచారంలో MLC శంభిపూర్

Spread the love
MLC Shambhipur is the king in Koyyalagudem door to door campaign

కొయ్యలగూడెం ఇంటింటి ప్రచారంలో MLC శంభిపూర్ రాజు


సాక్షిత : మునుగోడు నియోజకవర్గం, ఉప ఎన్నికల్లో భాగంగా కొయ్యలగూడెం గ్రామం ఇంచార్జి మేడ్చల్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారంలో పాల్గొని గ్రామంలో పర్యటించారు.

కాలనీ వాసులు నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం TRS పార్టీకి మద్దతు తెలిపిన వృద్దులకు, EVM బ్యాలెట్ నమూనాను చూపెడుతూ అవగాహన కల్పించారు.

కారు గుర్తుకు ఓటు వేసి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page